Ranveer Singh remuneration : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తర్వాత ఆయనకు పోటీ వచ్చే సూపర్ స్టార్ ఒక్కరు కూడా లేరు. ఆయన ఎంత కోరితే అంత డబ్బులు ఇవ్వడానికి రెడీ , కేవలం డేట్స్ ఇస్తే చాలు అనే రేంజ్ ప్రభాస్ సొంతం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది, ముఖ్యంగా సినీ రంగం లో ప్రతీ శుక్రవారం మారుతూనే ఉంటాయి. బ్లాక్ బస్టర్ హిట్స్ , పాత్ బ్రేకింగ్ హిట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ ని మించిన హీరో వచ్చేశాడు . అతనే రణవీర్ సింగ్. ‘ధురంధర్’ సిరీస్ కి ముందు ఇతను ఒక సాధారణ మీడియం రేంజ్ హీరో.
కానీ ఈ సిరీస్ తర్వాత ఓవర్ నైట్ సూపర్ స్టార్ గా మారిపోయాడు. మొదటి భాగం 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే , రెండవ భాగం ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా హీరో రణవీర్ సింగ్ నటనకు జేజేలు కొట్టారు ఆడియన్స్. ఆయనకంటూ ప్రత్యేకంగా జెన్ జీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్స్ బేస్ పుట్టుకొచ్చింది. అంతే కాకుండా భవిష్యత్తులో చేయబోయే సినిమాలు కూడా చాలా సాలిడ్ గా ఉన్నాయి. తన తదుపరి చిత్రాన్ని ‘ధురంధర్’ ఫేమ్ ఆదిత్య డర్ తోనే ప్లానింగ్ చేస్తున్నాడనే టాక్ కూడా బాలీవుడ్ లో బలంగా నడుస్తోంది. కాబట్టి రెమ్యూనరేషన్ కూడా ఆయన భారీగా పెంచేసాడని టాక్. ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 150 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. కానీ రణవీర్ సింగ్ తన తదుపరి చిత్రానికి ఏకంగా 315 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు.
ఇండియా లో ప్రస్తుతం రణవీర్ సింగ్ రెమ్యూనరేషన్ కి దరిదాపుల్లో వచ్చే హీరో ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే హీరో ఉండరేమో. కనీసం పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేని హీరో స్థాయి నుండి , ఏకంగా 315 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకునే రేంజ్ కి ఎదగడం, అది కూడా ఒకే ఒక్క సిరీస్ తో , ఇలాంటి అదృష్టం చాలా అరుదుగా వస్తుంటాయి, రణవీర్ సింగ్ కి ఈసారి అది కలిసొచ్చింది. కానీ అతను పడిన కష్టానికి ఈ మాత్రం ఎదుగుదల ఉండడం లో తప్పే లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
