
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆలిండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగసామి ప్రమాణస్వీకారం చేశారు. రంగసామి చేత లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. పుదుచ్చేరి రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పుదచ్చేరి సీఎంగా ప్రమాణం చేసిన రంగ సామికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళసై తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.