Raamam Raghavam Review
Ramam Raghavam Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవడానికి డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే కమెడియన్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న ధనరాజ్ సైతం దర్శకుడిగా తన లక్కును పరీక్షించుకున్నాడు. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామం రాఘవం’ సినిమాకి నిన్నటి నుంచే పెయిడ్ ప్రిమియర్స్ అయితే వేస్తున్నారు…మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే రామం కి ఒక కొడుకు పుడతాడు అతని పేరు రాఘవ అని పెడతాడు… రాఘవ చిన్నప్పటి నుంచి ఈ పని సరిగ్గా చేయడు. ఆయన ఏం చేయాలనుకున్నాడో కూడా అతనికి ఒక క్లారిటీ అయితే ఉండదు. తప్పుల మీద తప్పు చేస్తూనే ఉంటాడు తండ్రి చేతిలో తిట్లు తింటూనే ఉంటాడు. మరి ఫైనల్ గా రాఘవ ఏమయ్యాడు. తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేశాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తండ్రీ కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ తో కూడిన సినిమాలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాయింట్ తో వచ్చి ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ సినిమాలో తెలిసిన స్టోరీ అయినప్పటికీ దాన్ని ఎంగేజింగ్ గా మాత్రం చెప్పలేకపోయారు. కారణం ఏదైనా కూడా సినిమా రొటీన్ గా ఉన్నప్పటికి సీన్స్ లో వైవిధ్యాన్ని చూపించడంలో మాత్రం దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సీన్ లో ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్ గా రాసుకొని ఉంటే సినిమా మరో లెవెల్లో ఉండేది. కానీ అలా చేయకుండా రొటీన్ రొట్ట ఫార్ములా లో సీన్స్ రాసుకొని వాటిని ఎలివేట్ చేయాలనుకోవడం చాలా వరకు తప్పనే చెప్పాలి. ఇక ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం చేశాడు. కాబట్టి సీన్స్ లో సోల్ అనేది లేకపోవడం వల్ల స్క్రీన్ మీద దాన్ని సరిగ్గా పోట్రే చేయలేకపోయాడు. ధనరాజ్ లాంటి నటుడు దర్శకుడిగా మారి మంచి ప్రయత్నం అయితే చేసినప్పటికి అందులో సినిమా స్టోరీ ఎలా ఉంది? అది వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక ప్రాపర్ క్రాస్ చెక్ చేసుకోకుండా సినిమాను తీశాడు.
కొడుకు పాత్రలో కొంతవరకు ఓకే అనిపించినప్పటికి కామెడీ పాత్రలో ధనరాజ్ ను చూసి చూసి ఒక్కసారిగా సెంటిమెంటల్ సీన్లలో అతన్ని చూడాలంటే కొంత వరకు ఇబ్బందిగా అనిపించింది. ఇక ప్రతి సీన్ లో ఏదో ఒక మోటివేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసిప్పటికి సినిమాలో అంత పెద్దగా కాన్ఫ్లిక్ట్ ని జనరేట్ చేసే కథలేకపోవడం సీన్స్ కూడా ప్రేక్షకుడికి పెద్దగా రీచ్ కాకపోవడం సినిమా అంత బోరింగ్ గా సాగింది. ఇక సినిమాకి మ్యూజిక్ కూడా పెద్దగా ప్లస్ అయితే కాలేదు. మరి ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకుడిని పూర్తిస్థాయిలో అయితే మెప్పించలేదనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సముద్రఖని ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఆయన పాత్ర సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పాలి. కానీ కథలో మ్యాటర్ లేకపోవడంతో ఆయన క్యారెక్టర్ కూడా బోర్ కొట్టిస్తుంది. ఇక ధనరాజ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అద్భుతంగా చేసే ప్రయత్నం చేసినప్పటికి ఆయన ఫేస్ లో ఎమోషన్స్ కి పండిస్తూ మెప్పించడం అనేది కొంతవరకు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అందులో ధనరాజ్ కొంతవరకు అయితే సక్సెస్ అయ్యాడు… ఇక సత్య తన కామెడీతో అక్కడక్కడ నవ్వులు పూయించినప్పటికి అతనికి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా లేకపోవడం వల్ల పెద్దగా కనిపించలేకపోయాడు…ఇక మోక్ష, సునీల్, పృధ్వీ లాంటి నటులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు…
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అరుణ్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించినప్పటికి ఓవరాల్ గా సినిమా మ్యూజిక్ అయితే ప్రేక్షకుడిలో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కారణమేదైనా కూడా సినిమాకి మంచి మ్యూజిక్ ఉండుంటే రొటీన్ సినిమా అయిన కూడా నెక్స్ట్ లెవెల్ లో మెప్పించేది. ఇక విజువల్స్ పరంగా సినిమా ఓకే అనిపించినప్పటికి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అయితే ఇందులో మనకు కనిపించలేదు. ఇక ఎడిటర్ కూడా కొంతవరకు సినిమాను షార్ప్ కట్ చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా టెక్నికల్ విభాగాలు కొంతవరకు వాళ్ల పనితీరుని చాలా అద్భుతంగా చేసినప్పటికి కథకి ప్రేక్షకుడు అంత పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ప్రేక్షకుడికి హై ఫీల్ ఇవ్వలేకపోయాయి…
ప్లస్ పాయింట్స్
సముద్రఖని
సెకండాఫ్ లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్
మైనస్ పాయింట్స్
కథ
రోటీన్ స్క్రీన్ ప్లే
మ్యూజిక్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5