
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిపై ప్రతాపం చూపుతున్న బ్లాక్ ఫంగస్ ను రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 100 కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉండటంతో వీరికి చికిత్స అందించేందుకు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ హాస్పిటలో ప్రత్యేక వార్డును కేటాయించారు. మ్యూకోర్ మైకోసిస్ ను అంటువ్యాధిగా గుర్తించాం. రాజస్తాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చాం అని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.