
కొవిడ్ నేపథ్యంలో దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనీస వసతులను కల్పించకకపోడంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దిల్లీ విమానాశ్రయం యాజమాన్యం స్పందించింది. ప్రియమైన రాజమౌళి, ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఆర్టీపీసీఆర్ వివరాలకి సంబంధించి నిర్ణీత ప్రదేశాల్లో డెస్క్ లు ఉన్నాయి. మరికొన్ని ప్రదేశాల్లో డెస్క్ లు సంఖ్య పెంచుతాం. ప్రయాణికులకు కనిపించేలా బోర్డులు త్వరితగతిన ఏర్పాటు చేస్తాం. అని సమాధానం ఇచ్చింది.