
ఈనెల 5న తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు ఉత్తర బంగాళాఖాతంలో అప్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.