
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతల అకౌంట్లను ట్విట్టర్ సంస్థ అన్ లాక్ చేసింది. ఇటీవల ఢిల్లీలో రేప్, హత్యకు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేపథ్యంలో రాహుల్ తో పాటు ఆ పార్టీ నేతల అకౌంట్లను ట్విట్టర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విషయం తెలిసిందే. భారతీయ రాజకీయ వ్యవస్థలో జోక్యం చేసుకుని ట్విట్టర్ ప్రమాదకర ఆట ఆడుతున్నట్లు రాహుల్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ట్విట్టర్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను తిరిగి అన్ లాక్ చేసింది.