
ఎంపీ రఘరామ లేఖాలు కొనసాగుతున్నాయి. ఏపీ సీఎం జగన్ కి ఆదివారం మరో లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో అమరావతి నిర్మాణంపై లేఖ రాశారు. అమరావతి ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పుడు మూడు రాజధానులు అవసరమా? అని లేఖలో ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల ఒరిగేదేమీలేదని తేల్చిచెప్పారు.