
శాసనమండలి రద్దు చేయాలని సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. మెజార్జీ ఉన్నప్పుడు మండలి రద్దు చేస్తే చిత్తశుద్దిని ప్రజలు నమ్ముతారన్నారు. మెజార్జీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందన్నారు. మండలిలో మెజార్జీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుందని రఘురామ పేర్కొన్నారు. మండలి కొనసాగించడం వృథా అవుతుందని జగన్ చెప్పిన మాటలను నమ్మాలంటే, తక్షణమే మండలిని రద్దు చేయాలని పేర్కొన్నారు.