
ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణరాజు 10వ లేఖను రాశారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయం విషయంలో అశోక్ గజపతి రాజు కేసు గెలిచారని లేఖలో రఘురామ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రతినిధి విజయసాయిరెడ్డి నిరంతరం ఆరోపణలు చేస్తున్నారన్నారు. విజయసాయి రెడ్డిని కట్టడి చేయాలని లేకపోతే పార్టీకి నష్టం చేకూరుతుందని లేఖలో రఘురామ పేర్కొన్నారు. విజయసాయిరెడ్డిని, మంత్రులను పార్టీ మంచి కొరకు నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.