
దేశంలో కరోనా రోజు రోజుకు దిగి వస్తున్నది. మరో వైపు మరణాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లలో దేశంలో కొత్తగా 60,753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 97,743 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో వైపు 1,647 మరణాలు రికార్డయ్యాయని మంత్రిత్వశాఖ చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు పెరిగింది. ఇందులో 2,86,78,390 మంది బాధితులు కోలుకున్నారు.