
అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకుంటున్న తాజా పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రుల, అధికారులతో ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్ధాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అఫ్గాన్ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడంతో పాటు తాలిబన్ నాయకత్వంపై వ్యవహరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం.