
డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వోచర్ ఈ-రూపీని ప్రధాని మోదీ ఇవాళ ఆవిష్కరించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈరూపీ వోచర్ ను రిలీజ్ చేశారు. డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో దేశంలో ఈరూపీ కీలకపాత్ర పోషించనున్నట్లు మోదీ తెలిపారు. టార్గెట్ ప్రకారం.. చాలా పారదర్శకంగా ఎటువంటి లీకేజీ లేకుండా నగదును డెలివరీ చేయవచ్చు అని మోదీ అన్నారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతీో 21వ శతాబ్ధంలో ఇండియా ముందుకు వెళ్తున్న తీరుకు ఈ -రూపీని ఉదాహరణగా భావించవచ్చు అని ఆయన చెప్పారు.