
టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట పండుతోంది. ఈవెంట్ లో దేశానికి తొలి స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖారా, రజతం సాధించిన డిస్కస్ త్రోయర్ యోగేశ్ కతునియాను ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. మోదీ లేఖారాతో మాట్లాడుతూ ఇది చాలా గర్వించదగ్గ విషయం అని ఆమెను అభినందించారు. ప్రధాని మాటల అనంతరం అవని.. దేశ ప్రజల నుంచి తనకు లభించిన మద్దతు పై సంతోషం వ్యక్తం చేసింది.