
బంజారాలు, ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకలు బంజారా, ఆదివాసీ భవనాలు నగరం నడిబొడ్డున బంజారాహిల్స లో నిర్మిస్తున్న బంజారా, ఆదివాసీ భవనాల నిర్మాణ పనులు ఈ నెల 15 లోపు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం గిరిజన సంక్షేమ శాక చీఫ్ ఇంజినీర్ శంకర్, ఇతర ఇంజినీర్ అధికారులతో కలిసి మంత్రి భవన నిర్మాణాల పనులపై సమీక్షించారు. ఇప్పటికే దాదాపుగా భవనాల నిర్మాణం పూర్తి అయిందని అధికారులు వివరించారు.