
కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ప్రకాశం జిల్లా టీడీపీ నాయకుల బృందం భేటీ అయింది. వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం గెజిట్ లో చేర్చాలని విజ్ఞప్తి చేసింది. దిల్లీకి వెళ్లిన నేతల బృందంలో ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావుతో సహ జనార్థన్, ఉగ్రనరసింహారెడ్డి ఉన్నారు. కేంద్ర ఇటీవల విడుదల చేసిన తెలుగు రాష్ట్రాల్లోని నదులు, ప్రాజెక్టులు.. వాటిని అనుమతులకు సంబంధించిన గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేని విషయం తెలిసిందే.