Raja Saab Trailer Prabhas Voice : ప్రభాస్(Rebel Star prabhas) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘రాజా సాబ్’ మూవీ ట్రైలర్ నేడు సాయంత్రం విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ ని వింటేజ్ కామెడీ టైమింగ్ లో చూసి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మిర్చి తర్వాత ప్రభాస్ రేంజ్ నాటు మాస్ సినిమా రాలేదు. ఆడియన్స్ ఈ విషయం లో ప్రభాస్ ని బాగా మిస్ అయ్యారు. రాజా సాబ్ ట్రైలర్ తో ఆ లోటు పూడింది. అంతా బాగానే ఉంది కానీ ప్రభాస్ డైలాగ్ డెలివరీ విషయం లో మాత్రం అందరిలో తీవ్రమైన నిరాశ ఏర్పడింది. ఒకప్పటి లాగా షార్ప్ డైలాగ్ డెలివరీ ప్రభాస్ కి ఈమధ్య రావడం లేదు. సాహూ నుండి బాగా మారిపోయింది, గత రెండు మూడు సినిమాల్లో ఆ తేడా స్పష్టంగా కనిపించింది.
ఇక నేడు రిలీజ్ అయినా రాజాసాబ్ ట్రైలర్ లో అయితే అసలు ఇది ప్రభాస్ వాయిస్ యేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సోషల్ మీడియా లో అయితే ఇతర హీరోల అభిమానుల ట్రోల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇక విశ్లేషకులు అయితే ప్రభాస్ వాయిస్ కి ఏమైంది?, ఏమైనా సర్జరీ జరిగిందా?, అందుకే గొంతు లో తేడా వచ్చి వాయిస్ ఇలా మారిపోయిందా?, లేదా ఆయన డైలాగ్ డెలివరీ స్టైల్ పూర్తిగా మారిపోయిందా?, అసలు ప్రభాస్ కి ఏమైంది అంటూ సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. బుజ్జిగాడు మూవీ లో ప్రభాస్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాయిస్ లో ఆ బేస్, ఎనర్జీ, వేరే లెవెల్. తమిళ డైలాగ్స్ ని కూడా ఫుల్ ఎనర్జీ తో చెప్పేవాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ డైలాగ్ డెలివరీ లో ఊపు మిస్ అయ్యింది.
కనీసం సినిమాలో అయినా ఆ డైలాగ్ డెలివరీ మారుస్తాడో లేదో చూడాలి. ఇక రాజా సాబ్ విషయానికి వస్తే, ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 5 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ బయ్యర్స్ సంక్రాంతికి వస్తే బాగుంటుంది అని సూచనలు ఇవ్వడంతో జనవరి 9 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఒక స్టార్ హీరో హారర్ కామెడీ జానర్ లో నటించి చాలా సంవత్సరాలు అయ్యింది. సౌత్ లో కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక్కడే చేసాడు. ఆ తర్వాత ఎవ్వరూ ఆ ప్రయోగం చేయలేదు. ఇప్పుడు ప్రభాస్ చేసాడు, ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.