Spirit Prabhas Spirit : ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగానే సందీప్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ మీద కొన్ని భారీ యాక్షన్స్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక క్రేజ్ ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డి వంగ ఉన్నారట. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు.
తద్వారా ఆయనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతను 1000 కోట్ల క్లబ్ లో మాత్రమే ఉన్నాడు. 2000 కోట్ల క్లబ్లో చేరాలంటే మాత్రం ఆయన మరింత కసరత్తులు చేయాల్సిన అవసరం అయితే ఉందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
నిజానికి సందీప్ రెడ్డివంగా సినిమాలో అసలు సిజీ షాట్స్ అనేవి ఉండవు. అయిన కూడా ఆయన ఒక ఎమోషన్ ని పట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. కాబట్టి అతనికి భారీ క్రేజ్ దక్కింది. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ల నుంచి వచ్చే సినిమాకి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో సందీప్ రెడ్డి వంగ నుంచి వచ్చే మూవీకి సైతం అదే రీతిలో క్రేజ్ దక్కుతుంది. ఇక అలాంటి సందీప్ రెడ్డివంగా ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.
ప్రభాస్ ని డిఫరెంట్ లుక్ లో ప్రజెంట్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…ఇక సందీప్ మాత్రం ప్రభాస్ డూప్ తో కాకుండా ప్రభాస్ తోనే ఎక్కువ షాట్స్ షూట్ చేస్తున్నాడట…