YSRCP Legal Cell Lawyer: సినిమాల ప్రభావం సామాన్యుల మీద మాత్రమే కాదు, రాజకీయ నాయకుల మీద కూడా విపరీతంగా ఉంటుంది. కాకపోతే సామాన్యులు బయటపడతారు. రాజకీయ నాయకులు అంతర్గతంగా సినిమా హీరోల మాదిరిగా ప్రవర్తిస్తూ.. వాటిని కెమెరాలలో బంధిస్తూ.. ఆ వీడియోలను చూసి ఆనందిస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి ఆ తరహా వీడియోలు ఎంతకాలమో గుప్తంగా ఉండడం లేదు. వెంటనే బయట పడుతున్నాయి. ఆ తర్వాత వివాదానికి కారణం అవుతున్నాయి.
వైసీపీకి చెందిన లీగల్ సెల్ సభ్యుడు వెంకటేశ్వర శర్మ యానిమల్ సినిమాలో బాబి డియోల్ మాదిరిగా ప్రవర్తించాడు. నోట్ల కట్టలతో డాన్సులు వేసి అదరగొట్టాడు. ఓ హోటల్లో మంచం పై పడుకొని.. తన ఒంటిపై కరెన్సీ నోట్ల కట్టలు పెట్టుకొని మెలికలు తిరిగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.. వాస్తవానికి వెంకటేశ్వర శర్మకు ఆ స్థాయిలో డబ్బు ఎక్కడిది అనే ప్రశ్న కూడా పొలిటికల్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర శర్మ అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతానికి చెందిన పలువురు యువకులకు రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలలో వసూలు చేశాడు. అంతేకాదు మంది మార్బలంతో హడావిడి చేసేవాడు. తాను న్యాయవాదిని చెప్పుకుంటూ.. తన దగ్గరికి వివిధ కేసుల పరిష్కారం నిమిత్తం వచ్చే వారి దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. ఆ తర్వాత కేసులను వాదించకుండా తప్పించుకుని తిరిగేవాడు. ఫోన్ చేస్తే ఎత్తెవాడు కాదు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులతో విచ్చలవిడిగా జల్సాలు చేసేవాడు
వెంకటేశ్వర శర్మ వయసు 50 కి మించినప్పటికీ.. ఇప్పటికి తను యువకుడినని ఫీల్ అవుతుంటాడు. దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ యువతులతో ఎంజాయ్ చేసి వస్తుంటాడు. అశ్లీల నృత్యాలు చేస్తూ వారిపై డబ్బు చల్లుతూ.. ఆ దృశ్యాలను వీడియోలు తీయించుకుంటాడు. చిల్లర వేషాలు వేస్తాడు.. తాజాగా యానిమల్ సినిమాలో విలన్ మాదిరిగా వెంకటేశ్వర శర్మ ప్రవర్తించిన నేపథ్యంలో పోలీసులు అతనిపై దృష్టి పెట్టారు. వైసీపీ లీగల్ సెల్ లో ఉంటున్న వెంకటేశ్వర శర్మ ఇలాంటి దారుణాలకు పాల్పడడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఇటీవల వెంకటేశ్వర శర్మ దగ్గరికి న్యాయ సలహా కోసం ఓ మహిళ వచ్చింది. ఆమె పట్ల వెంకటేశ్వర శర్మ అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. దీంతో మాచవరం పోలీసులు వెంకటేశ్వర శర్మ మీద కేసు నమోదు చేశారు.