Pawan Kalyan : వరంగల్ చెందిన నిరంజన్ అనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని రీసెంట్ గానే కన్నుమూసిన ఘటన యావత్తు ప్రజానీకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. చిన్న తనం నుండి జెన్యూ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి , చివరి కోరిక కోరుతూ , ఒక్కసారి పవన్ కళ్యాణ్ ని చూడాలని ఉందని అనగా, ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన వరంగల్ వెళ్ళి , ఆ చిన్నారిని సందర్శించి , అతని బాగోగులు అడిగి తెలుసుకొని , ఆ చిన్నారికి కావాల్సివన్నీ అందేలా చేశారు. ఆ రోజు ఆ కుర్రాడిలో కలిగిన ఆనందాన్ని చూసి, కచ్చితంగా ఇంకా కొన్నేళ్లు బ్రతుకుతాడని అనుకున్నారు. కానీ కనీసం వారం రోజులు కూడా బ్రతకలేదు. అనారోగ్యం తీవ్ర రూపం దాల్చడం తో తుది శ్వాస విడిచారు. ఈ ఘటన పవన్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా, ఇతరులను కూడా చాలా బాధకు గురి చేసింది.
అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి పేర్ని ఎంత నీచాతి నీచం గా , అమానవీయంగా మాట్లాడాడో మన కళ్లారా చూశాము . ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులను ఈ పవన్ కళ్యాణ్ పట్టించుకోడు. కానీ అక్కడెక్కడో తెలంగాణాలో అన్నా నాకు ఆరోగ్యం బాగాలేదని ఎవడో అన్నాడట, నేనొస్తున్నా తమ్ముడు అంటూ ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు’ అంటూ సెటైర్లు విసిరాడు. దీనిపై సోషల్ మీడియా లో పేర్ని నాని పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నెటిజెన్స్. ఇక ఆ బిడ్డ చనిపోయాక , అతని తండ్రి కూడా పేర్ని నాని పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అతను మాట్లాడిన మాటలు విని నా బిడ్డ చాలా బాధపడ్డాడని , రెండు రోజులు అన్నం తినలేదని , ఈరోజు నా బిడ్డ చనిపోవడానికి ఆ పేర్ని నాని నే కారణమని బల్లగుద్ది చెప్పగలను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నిరంజన్ తండ్రి.
అంతే కాకుండా చివరి రోజుల్లో నిరంజన్ మాట్లాడిన మాటలను కూడా మీడియా కి విడుదల చేశారు. ఆ వీడియో లో నిరంజన్ మాట్లాడుతూ ‘పేర్ని నాని నిన్న పవన్ కళ్యాణ్ సార్ వచ్చినందుకు , నన్ను , మా పవన్ కళ్యాణ్ సార్ ని చాలా తిట్టారు. దానికి ఆయన నాకు క్షమాపణలు చెప్పకపోయినా పర్వాలేదు , మా పవన్ కళ్యాణ్ సార్ కి క్షమాపణలు చెప్పాలి’ అంటూ చెప్పుకొచ్చారు నిరంజన్. అంతే కాకుండా, ఆయన ఎంత బాదపడ్డారో కూడా ఈ వీడియో చివర్లో చూపించారు. ఇది చూసిన తర్వాత ఎవరికైనా రక్తం మరగక తప్పదు. ఎంత రాజకీయాలు చేసినా , మానవత్వ కోణాన్ని వైసీపీ నాయకులు పూర్తిగా మర్చిపోయారు , ఇలాంటోళ్ళు మన రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నాశనం అయిపోతావ్ @perninani pic.twitter.com/CCN4TQURez
— Pradeep Deepu (@Im_pradeeproyal) July 15, 2026
