Guava Fruit : ఆరోగ్యానికి పండ్లు చాలా మేలు చేస్తాయి. సీజనల్‌గా చాలా పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే సీజనల్‌గా దొరికే పండ్లలో జామ పండులు గురించి తెలిసిందే. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. డైలీ ఈ జామ పండ్లను తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా విముక్తి చెందుతారు. అయితే ఇందులోని విటమిన్ ఏ కళ్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అయితే చలికాలంలో జామ పండును తినడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు వస్తాయని కొందరు భావిస్తారు. కానీ చలికాలంలో జామ పండు తినడం వల్ల ఇంకా జలుబు తగ్గుతుందని, కానీ పెరగదని నిపుణులు చెబుతున్నారు. ఏ సీజన్‌లో అయిన జామ కాయలను తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలే కానీ, నష్టాలు లేవని తెలిపారు. మిగతా పండ్లతో పోలిస్తే జామ కాయలు తక్కువ రేటుకే లభిస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని కొనుగోలు చేయకపోయిన కూడా ఇంటి దగ్గరే చెట్టును కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు తొందరగానే పెరుగుతుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఈ జామ కాయలను కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదు. అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు జామ కాయలను తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జామ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే అలెర్జీ సమస్యలు ఉన్నవారు వీటిని అసలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలెర్జీ ఉన్నవారు వీటిని తినడం వల్ల చర్మ వ్యాధులు, శ్వాసకోస సమస్యలు, దద్దుర్లు, మంట, వాపు వంటివి వస్తాయని తెలిపారు. ఈ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా జామ కాయలను అసలు తినకూడదు. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు జామ కాయలను అసలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటిని తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. జామ కాయ తొందరగా జీర్ణం కాదు. దీంతో సమస్య ఇంకా తీవ్రం అయ్యే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు జామ కాయలను తినడం కాస్త తగ్గించాలి. ఎందుకంటే ఈ పండు అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జామ పండ్లను రసాయనాలతో పండిస్తున్నారు. వీటివల్ల శరీరానికి హాని జరగుతుంది. కాబట్టి గర్భిణులు, బాలింతలు వీటిని తీసుకునే ముందు వైద్యుల సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే శస్త్ర చికిత్స చేయించుకున్నవారు జామ పండ్లు తినేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.