
ఈటల రాజేందరే కాదు బీజేపీలోకి సీఎం కేసీఆర్ వచ్చినా స్వాగతిస్తామని మాజీ మంత్రి, బీజేపీ నేత పెద్దిరెడ్డి అన్నారు. కేసీఆర్ ను తాను కలవలేదని, ఆయన ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో తెలియదన్నారు. బీజేపీలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారని, వారందరూ అర్హులేనని పెద్దిరెడ్డి అన్నారు. తాను నాలుగు పర్యాయాల హుజూరాబాద్ నుంచి పోటీ చేశానని, రెండు సార్లు మంత్రిగా పనిచేశానని గుర్తుచేశారు.