Homeఎంటర్టైన్మెంట్Peddi 18 days collection : 'పెద్ది' 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. నార్త్...

Peddi 18 days collection : ‘పెద్ది’ 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. నార్త్ అమెరికా లో ‘అజ్ఞాతవాసి’ని మించిన డిజాస్టర్..

Peddi 18 days collection : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం మరో భారీ మైల్ స్టోన్ ని దాటింది. 18 రోజుల థియేట్రికల్ రన్ లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. దీంతో రామ్ చరణ్ ఏకంగా 200 కోట్ల షేర్ క్లబ్ లోకి సోలో హీరో గా అడుగుపెట్టింది. దీంతో మన టాలీవుడ్ లో రెండు సార్లు 200 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టిన మూడవ హీరో గా రామ్ చరణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక పక్క సమంత ‘మా ఇంటి బంగారం’ ఫ్రెష్ గా విడుదలై , బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నప్పటికీ కూడా ‘పెద్ది’ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపించలేదు.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 18 వ రోజున 1 కోటి 51 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టింది. అంతా బాగానే ఉంది కానీ , నార్త్ అమెరికా లో మాత్రం ఈ చిత్రం డబుల్ డిజాస్టర్ గా నిల్చింది. కేవలం నార్త్ అమెరికా ఒక్కటే కాదు , ఓవర్సీస్ మొత్తం కూడా ఇదే పరిస్థితి. 10 మిలియన్ డాలర్లకు ఈ సినిమాని కొంటే , కనీసం 5 మిలియన్ డాలర్ల గ్రాస్ కూడా రాలేదు. బయ్యర్ కి ఒకప్పుడు అజ్ఞాతవాసితో ఏ రేంజ్ నష్టం వచ్చిందో , మళ్లీ ఇన్నేళ్లకు అదే రేంజ్ నష్టం వచ్చిందని అంటున్నారు. ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , ఒక నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 18 రోజుల్లో 54 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ లో 21 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిందో.

ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర నుండి 22 కోట్ల 66 లక్షలు రాబట్టిన ఈ చిత్రణకి తూపు గోదావరి నుండి 12 కోట్ల 76 లక్షలు , పశ్చిమ గోదావరి నుండి 9 కోట్లు , గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 50 లక్షలు, కృష్ణ నుండి 10 కోట్ల 10 లక్షలు , నెల్లూరు నుండి 5 కోట్ల 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలాగే కర్ణాటక నుండి 15 కోట్ల 20 లక్షలు , తమిళ నాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 10 లక్షలు, ఓవర్సీస్ నుండి 23 కోట్ల 40 లక్షలు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 341 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version