Pawan Kalyan Rajahmundry tour : పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రి పర్యటన ఆద్యంతం ఆకట్టుకుంది. హృదయానికి హత్తుకుంది. పర్యావరణానికి ఇచ్చే ప్రాధాన్యత.. ప్రేమ ఎంతో గొప్పగా ఉంది. గోదావరి పుష్కరాల్లో పన్నీరు స్నానం అవసరం లేదని.. కెమికల్స్ స్నానం లేకుండా ఉంటే చాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
రాజమండ్రి వద్ద కాలుష్య కారకాలైన మురికి నీరు, కెమికల్ నీరు గోదావరిలో కలుస్తోందని.. దీనివల్ల భక్తులు పుష్కర స్నానం ఎలా చేస్తారంటూ పవన్ ప్రశ్నించారు.
ఇక రాజమండ్రిలో జనసేన సమావేశంలో తనను విమర్శించే వారిపై ఘాటైన విమర్శలు చేశారు. కాపు కుల సంఘాలు , దాసరి రాము లాంటి వారు కూడా పవన్ ను విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను కుల నాయకుడిగా ముద్ర పడాలని వారంతా కుట్ర చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం తాను ఎప్పుడూ కుల పక్షపాతిని కాదని కుండబద్దలు కొట్టారు.
ఆంధ్ర సమాంతర రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడు.. దీనిపై ’రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
