
ఈనెల 10వ తేదీ నుంచి 14 తపాలా కార్యాలయాల్లో పాస్ పోర్టు సేవలు పునరుద్ధరణ కానున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో గతనెల 12 నుంచి పాస్ పోర్టు సేవలు ఆగిపోయాయి. అత్యవసరంగా విదేశాలకు వెళ్లే వారికి మాత్రమే లాక్ డౌన్ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులతో తపాలా కార్యాలయాల్లో పాస్ పోర్టు సేవలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సాధారణ సమయాల్లో పాస్ పోర్టు సేవా కేంద్రాలు పని చేయనున్నాయి.