pakistan vs india : గంధపు చెక్కలు ధూపాన్ని వేసినప్పటికీ గాడిద తన లక్షణాన్ని కోల్పోదు. ఈ వాక్యం లాగానే ఉంది పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ పరిస్థితి. ఒకవైపు ఐసీసీ పాకిస్తాన్ ఆటగాళ్ల మీద మండిపడుతున్నప్పటికీ.. మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నప్పటికీ.. ఆ ప్లేయర్లలో మార్పు రావడం లేదు. పైగా వారు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టానుసారంగా సంకేతాలు చేస్తూ పరువు తీసుకుంటున్నారు. అసలు ఎలా ఆడుతున్నాము? ఇలా ఆడాలి? అనే కనీస విచక్షణ పాకిస్తాన్ ఆటగాళ్లకు లేకుండా పోయింది. తాజాగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
ABRAR AHMED GETS IMPORTANT BREAKTHROUGH FOR PAKISTAN..!!
– Sanju Samson dismissed for 24 in 21 balls.#AsiaCup2025 #AsiaCupFinal #INDvPAK #INDvPAK pic.twitter.com/co6B0bFoq3
— (@Faizanali_152) September 28, 2025
టీమిండియా ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో.. అప్పటికే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జట్టును తిలక్ వర్మ, సంజు శాంసన్ నిలబెట్టారు. నాలుగో వికెట్ కు ఏకంగా 50+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో సంజు శాంసన్ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో పెవిలియన్ చేరుకున్నాడు. సంజు ను అవుట్ చేసిన తర్వాత అహ్మద్ వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టుగా తల ఊపుతూ సంకేతాలు ఇచ్చాడు. దీంతో టీమ్ ఇండియా అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.
— Naman Mahna (@naman_mahna) September 28, 2025
గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు కూడా అహ్మద్ గిల్ వికెట్ తీసి ఇలానే ప్రవర్తించాడు. దీంతో విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్లో సెంచరీ చేసి గట్టి బదులిచ్చాడు. ఫలితంగా అహ్మద్ బలుపు నేలకు దిగింది. ఇక ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో హసరంగను అవుట్ చేసి గేలి చేశాడు. దీనికి హసరంగ కూడా అదే స్థాయిలో బదులు తీర్చుకున్నాడు. ఇలాంటి పరిణామాలు వరుసగా ఎదురవుతున్నప్పటికీ.. అంతర్జాతీయంగా పరుగు పోతున్నప్పటికీ అహ్మద్ తన తీరు మార్చుకోవడం లేదు. పైగా నేలబారు ప్రదర్శనతో మరింత దిగజారుతున్నాడు.
Arshdeep Singh New Instagram Reel
– Bro roasted that fraud bowler pic.twitter.com/Sso722oL72
— (@jod_insane) September 28, 2025
ABRAR AHMED STRIKES, BREAKS THE PARTNERSHIP, SANJU SAMSON GONE! https://t.co/jOHS8zThfK
— PCT Replays 2.0 (@ReplaysPCT) September 28, 2025