Pakistan PM insult : అమెరికా కొమ్ములు విరచాలని.. ఆ దేశాన్ని నేల నాకించాలని చైనా గట్టి పట్టుదలతో ఉంది. కాకపోతే అది అనుకున్నంత ఈజీ కాదు. అమెరికాను నేల నాకించాలంటే కచ్చితంగా డ్రాగన్ దేశానికి భారత సపోర్ట్ అవసరం. అందువల్లే భారత ప్రధానికి డ్రాగన్ అధినేత జిన్ పింగ్ ఫోన్ చేశారు. తమతో కలిసి రావాలని సూచించారు. దీనికి మోడీ అనేక షరతులు విధించారు. ఆ షరతులకు ఒప్పుకొని డ్రాగన్ దేశ అధినేత తమ భూభాగంలోకి మోడీని ఆహ్వానించారు. నాలుగు సంవత్సరాల తర్వాత.. అది కూడా గాల్వాన్ లోయ ఘటన తర్వాత ప్రధాని చైనాలో పర్యటించారు. అంతేకాదు చైనాలో ప్రధానికి అత్యంత ఘన స్వాగతం లభించింది. చైనా అధ్యక్షుడు భారత ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రతి విషయంలోనూ మోడీ చెప్పిన సలహాలను.. సూచనలను స్వీకరించారు. తద్వారా గ్లోబల్ లీడర్ గా మోడీ మరోసారి తన ఖ్యాతిని పెంచుకున్నారు. ఇదే క్రమంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఘోరంగా తన పరువును పోగొట్టుకున్నారు.
చైనాలోని జరుగుతున్న వాణిజ్య సదస్సుకు పాకిస్థాన్ ప్రధానమంత్రి కూడా హాజరయ్యారు. చైనాలోని టియాన్ జిన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరయ్యారు. పుతిన్ తో జిన్ పింగ్ సరదాగా మాట్లాడారు. వారిద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని ముందుకు సాగారు. ఈ సమయంలో తమకు ఎదురైన పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ను వారు పట్టించుకోలేదు. వివిధ దేశాల అధ్యక్షులను కలవడానికి డ్రాగన్, రష్యా అధినేతలు ముందుకు సాగారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఏమాత్రం పట్టించుకోలేదు. పాకిస్తాన్ ప్రధాని తన స్థానం నుంచి ముందుకు వచ్చి.. చైనా, రష్యా అధినేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే చివర్లో పుతిన్ ను కలిసి షహబాజ్ కొంతలో కొంత తన పరువును కాపాడుకున్నారు.
షహబాజ్ కు ఘోరమైన అవమానం ఎదురైన నేపథ్యంలో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి..” మీలాంటి వారికి ఇలాంటి వేదికలు సరికావు. ఉగ్రవాదులు జరుపుకునే వేడుకలకు మీరు కచ్చితంగా వెళ్లాలి. అక్కడ మీకు అద్భుతమైన స్వాగతాలు లభిస్తాయి. ఘనమైన విందులు లభిస్తాయి.. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణాలు తీసే ఆయుధాలు దొరుకుతాయి. బాంబులు.. ఇతర సామాగ్రి కూడా మీకు లభిస్తుంది. అలాంటి చోటకు మీరు వెళ్లాలి. అంతేతప్ప ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఇలానే ఉంటుంది.. ఇప్పటికైనా ఉగ్రవాదం.. ప్రజాస్వామ్యం కలిసి ప్రయాణం సాగించలేవని గుర్తు పెట్టుకోవాలి. ఉగ్రవాదులతో కలిసి ప్రయాణం సాగిస్తే ఇదిగో పరిస్థితి ఇలానే ఉంటుంది. ప్రపంచ దేశాలు చూస్తూ ఉండగా పరువు పోగొట్టుకోవాల్సి ఉంటుందని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.