ICC T20 World Cup 2026 : మరో పది రోజుల్లో భారత్, శ్రీలంక వేదికగా టీ 20 వరల్డ్ కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో బంగ్లాదేశ్ జట్టు.. తాము భారత్‌లో ఆడేది లేదని ప్రకటించింది. వేదికలు మార్చాలని ఐసీసీని కోరింది. ఈ తరుణంలో వేదికలు మార్చడం కుదరదని ఐసీసీ తేల్చి చెప్పింది. కారణాలు లేకుండా వేదికలు మార్చాలని కోరడాన్ని తప్పు పట్టింది. అయినా బంగ్లాదేశ్ భారత్‌లో ఆడమని తెలిపింది. దీంతో ఐసీసీ బంగ్లాదేశ్‌ను తప్పించి స్కాట్లాండ్ను చేర్చుకుంది. ఈ విషయమై పీసీబీ చైర్మన్ నఖ్వీ స్పందించారు. బంగా్లదేశ్ విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని పేర్కొన్నారు. పాకిస్తాన్ కూడా టీ20 ఆడే విశయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ కూడా వైదొలుగుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఈతరుణంలో పీసీబీ టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది.
పాల్గొన్నా అనిశ్చితే..
ఒకవైపు టోర్నీ బహిష్కరణ ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. అయితే.. ప్రభుత్వ అనుమతి ఆధారంగా మాత్రమే పాల్గొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి ఇవ్వకుంటే టోర్నీకి దూరంగా ఉంటామని సీపీబీ స్పష్టం చేసింది. జట్టును ఎంపిక చేయడం తమ బాధ్యత అని అందుకే తుది జట్టును ప్రకటించామని సెలక్టర్లు తెలిపారు. తుది నిర్ణయం ప్రభుత్వదే అని అని స్పష్టం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని షహబాజ్ షరీఫ్ వచ్చాక తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
రాజకీయ రంగు..
ఫిబ్రవరి 7న కొොలంబోలో శ్రీలంక-నెదర్లాండ్స్ మా్యచ్తో టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచి పాకిస్తాన్ కూడా వైదొలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు ప్రచారం జోరందుకుంది. ఈ తరుణంలో జట్టును ప్రకటించడం ఆసక్తిగా మారింది. భారత్-బంగ్లాదేశ్ ఉద్రిక్తతల నేపథ్యంలో పీసీబీ మద్దతు రాజకీయ రంగు పులుముకుంది. ఇది పాక్ క్రికెట్‌కు ఆర్థిక, ర్యాంకింగ్ నష్టాలకు దారితీయవచ్చు.
పాకిస్తాన్ జట్టు..
సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా గత ఆసియా కప్ నుంచి తిరిగి చేరారు. తొలిసారి ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, సాహిబ్జాదా ఫర్హాన్, ఉస్మాన్ తారిక్ చోటు సాధించారు.
PAKISTAN BOYCOTT T20I WORLD CUP 2026
– The Pakistan government is determined to boycott the World Cup in support of Bangladesh. They believe that the ICC did not act fairly by excluding Bangladesh.#BangladeshCricket #ISN29 #WorldCup2026
pic.twitter.com/UoZlBc0zVl— lndian Sports Netwrk (@IS_Netwrk29) January 24, 2026