
తొలి ఇన్నింగ్స్ లో పేలవ బ్యాటింగ్ తో వెనుకబడ్డ భారత్.. రెండో ఇన్నింగ్స్ లో గొప్ప పోరాటంతో మ్యాచ్ లో పైచేయి సాధించింది. రోహిత్ కెరీర్లోనే అత్యుత్తమం అనదగ్గ శతకం సాధించడంతో భారత్ విజయం పై కన్నేసే స్థితికొచ్చింది. రోహిత్ తోడుగా పుజారా కూడా ఇంగ్లాండ్ పేస్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వేళ.. టీమ్ ఇండియా లోటును పూడ్చేసి 171 పరుగుల ఆధిక్యం సంపాదించింది. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి. కోహ్లీసేన మరో 60-70 పరుగులు సాధిస్తే.. ఇంగ్లాండ్ కు సవాలు తప్పదు.