
భర్త నిఖిల్ జైన్ తో విడిపోవడం పై బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఎట్టకేలకు మౌనం వీడింది. నిఖిల్ తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఇది భారతదేశంలో చెల్లదని ఆమె బుధవారం ఒక సుదీర్ఘ ప్రకటనలో వెల్లడించింది. కుటుంబ ఆభరణాలు, ఇతర ఆస్తుల మాదిరిగా తన వస్తువులను అక్రమంగా వెనక్కి తీసుకున్నారని ఆమె ఆరోపించారు. మా వివాహం చట్టబద్ధమైంది కాదు, అందుకే అతడి నుంచి విడాకులు తీసుకోవలసిన అవసరం లేదని నుస్రత్ స్పష్టం చేశారు.