
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల, సుంకేసుల, హంద్రీ జలాశయాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 50,028, సుంకేసుల నుంచి 2,215, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. జలకళతో శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 15,713 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశంయ నీటి మట్టం 845.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 70.8225 టీఎంసీలుగా ఉంది.