
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజి వాడి వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో పదిహేను మంది గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సామగ్రితో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా దవాఖానకు తలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.