
అరేబియా సముద్రంలో ఏర్పడి తీరం వైపు దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్ ఈ నెల 18న ఉదయం గుజరాత్ తీరాన్ని తాకనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ తీరాన్ని తాకేటప్పుడు గంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈదురు గాలులకు తోడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇదిలా వుంటే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం 79 ఎన్టీఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది.