
కరోనా మహమ్మారి ఉదృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలపై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల కంటే విద్యార్థుల జీవితాలు చాలా ముఖ్యమైనవన్నారు. ఈ మేరకు పరీక్షలు రద్దు చేయాలని ఒడిశా కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ను ఆదేశించారు.