
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఉదయం ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ప్రతి ఒక్కరికీ రంజాన్ శుభాకాంక్షలు. నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్న మీకు, మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాను. త్వరలోనే కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని, ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వస్తా. సురక్షితంగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి అని ఎన్టీఆర్ ట్వీట్ పెట్టారు.