Phone tapping case : తెలంగాణలో గత బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. సీఎం కేసీఆర్ హయాంలో ఎస్‌ఐబీ అధికారులు ప్రతిపక్ష నేతల ఫోన్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే నేతల ఫోన్లు, బీఆర్‌ఎస్ పార్టీలోని కొంత మంది కీలక నేతల ఫోన్లతోపాటు సెలబ్రిటీలు, సినీ ఇండస్ట్రీకి చెందినవారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పటికే ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పలువురు ఐఎస్‌బీ అధికారులను అరెస్ట్ చేశారు. కొందరు ఇప్పటికీ రిమాండ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ కేసులో కీలకమైన రిౖటñ ర్డ్ ఐపీఎస్ ప్రభాకర్‌రావు ఎఫ్‌ఐఆర్ నమోదైన మరుసటి రోజే అమెరికా పారిపోయారు. ఈ ఏడాది మార్చి నుంచి ఆయన అందుబాటులో లేరు. కొన్ని రోజులు అనారోగ్య కారణాలు చెప్పి రాలేదు. చికిత్స తర్వాత వస్తానని వెల్లడించారు. కానీ, చివరకు ఆయన అక్కడే ఉండాలని గ్రీన్ కార్డు తీసుకున్నారు. దీంతో ఆయనను రప్పించడం క్లిష్టంగా మారింది.
నేతలకు నోటీసలు..
ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు పోలీసులకు నోటీసులు ఇచ్చి విచారణ చేసిన రాష్ట్ర పోలీసులు.. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఇప్పుడు నేతలకు నోటీసులు ఇస్తున్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఇంతకాలం పోలీసు అధికారులక పరిమితమైన దర్యాప్తు ఇప్పుడు రాజకీయ కోణం సంతరించుకుంటోంది. మొదటగా ఈ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ పోటీసులు.. తాజాగా మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు జారీ చేసినవారిలో ఉమ్మడి నల్గొండ జిల్లకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ఖర్చుపైనా ఆరా..
ఫోన్ ట్యాపింగ్ కేసుతోపాటు తెలంగాణ పోటీసులు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వీరు అప్పట్లో వ్యవహించిన తీరుపై విచారణ చేసేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నాటి లావాదేవీలపైనా ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే.. నోటీసుల విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఐదురురిని ప్రశ్నించిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
రూ.7 కోట్ల సొమ్ముపై ఆధారాలు..
ఇదిలా ఉంటే ఇదే కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న అదనపు ఎస్పీ(సస్పెండెడ్) తిరుపతన్న ఫోన్ సంభాషణల నేపథ్యం చిరుమర్తి లింగయ్యను ఈనెల 11న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనికి ఈనెల 14న వస్తానని ఆయన సమాధానం ఇచ్చారు. తిరుపతన్న మొన్నటి అసెంబ్లీ ఎన్నకల సమయంలో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన అభ్యర్థుల, ప్రతిపక్ష నేతల కదలికలపై తన బృందంతో ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ప్రత్యర్థి పార్టీలకు ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించేందుకు ఈ బృందం పనిచేసినట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఓ ప్రధాన పార్టీ తరఫున రూ.7 కోట్లు తరలించినట్లు ఫోన్ అక్రమ ట్యాపింగ్ దర్యాప్తులో వెల్లడైంది. పోలీస్ అధికారి వాహనంలో ఎస్కార్ట్ ఇచ్చి ఆ సొమ్ము పంపినట్లు గుర్తించారు. సమయంలో ఎస్కార్ట్ వెళ్లిన పోలీస్ సిబ్బంది నుంచి కూడా వాగ్మూలం సేకరించారు.