
డ్రగ్స్ కేసు వ్యవహారం సినీ ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తోంది. ఈ కేసులో రోజురోజుకు ఎవరి పేర్లు బయటపడుతాయోనని పరిశ్రమకు చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో డ్రగ్ వ్యవహారం సినీ నటుల మెడకు చుట్టుకుంటోంది. తాజాగా బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న దీపికా పదుకొనేకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సమన్లు జారీ చేయనుంది. అంతేకాకుండా శ్రద్దాకపూర్, సారా అలీఖాన్‌లకు కూడా సమన్లు జారీ అవుతాయని తెలుస్తోంది.
Also Read: సుశాంత్ కేసులో బాలీవుడ్ స్టార్లు, తెలుగు హీరో భార్య?