Homeలైఫ్ స్టైల్non stick cookware safety : నాన్ స్టిక్ పాత్రలపై గీతలు పడితే వాడొద్దు.. అందులో...

non stick cookware safety : నాన్ స్టిక్ పాత్రలపై గీతలు పడితే వాడొద్దు.. అందులో వండొద్దు.. ఎందుకో తెలుసుకోండి..

non stick cookware safety : ఇళ్లలో ఉండే వంట పాత్రల్లో కూడ ఆరోగ్యం ఉంటుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. వంట పాత్రలు బాగుంటేనే అందులో వండిన ఆహారం తినడం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో భాగంగా నాన్-స్టిక్ వంట పాత్రల వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. నాన్ స్టిక్ వంట పాత్రల వాడకం ఇప్పుడు చాలా ఇళ్లలో సాధారణమైపోయింది. అయితే వీటి భద్రతపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా గీతలు పడిన నాన్-స్టిక్ పాత్రల్లో వండిన ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Apollo Hospitalsకు చెందిన ప్రముఖ వైద్యురాలు Sangita Reddy వెల్లడించిన ప్రకారం.. నాన్ స్టిక్ వంట పాత్రలపై గాతలు పడితే క్యాన్సర్ కారకాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా నాన్-స్టిక్ పాత్రలపై ప్రత్యేకంగా కోటింగ్ ఉంటుంది. ఇది Polytetrafluoroethylene అనే పదార్థంతో తయారవుతుంది. మార్కెట్‌లో ఇది సాధారణంగా Teflon పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ కోటింగ్ వల్ల ఆహారం అంటుకోదు. తక్కువ నూనెతో వంట చేయవచ్చు. కానీ కోటింగ్ దెబ్బతింటే సమస్య మొదలవుతుంది.

ఒక పరిశోధన ప్రకారం టెఫ్లాన్ కోటింగ్ ఉన్న పాత్రపై ఒక్క చిన్న గీత పడినా వేల సంఖ్యలో మైక్రో, నానో పరిమాణంలోని కణాలు బయటకు రావచ్చు. కొన్ని అధ్యయనాలు ఒక గీతతోనే 9,000కు పైగా సూక్ష్మకణాలు విడుదలయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఇవి ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. పాత తరహా నాన్-స్టిక్ తయారీలో Perfluorooctanoic acid వంటి PFAS కెమికల్స్ ఉపయోగించేవారు. ఇవి “ఫారెవర్ కెమికల్స్”గా పేర్కొంటారు. ఇవి శరీరంలోకి వెళితే సులభంగా బయటకు వెళ్లలేవు. కాలేయం, థైరాయిడ్, హార్మోన్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని పరిశోధనలు చెబుతున్నాయి.

PFAS తరహా కెమికల్స్ దీర్ఘకాలం శరీరంలో పేరుకుపోతే కొన్ని రకాల క్యాన్సర్లకు సంబంధం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇవి ముఖ్యంగా కిడ్నీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే టెస్టిక్యులర్ క్యాన్సర్ రిస్క్ పెరగొచ్చని కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఇది ఎక్కువగా దీర్ఘకాలిక, అధిక ఎక్స్‌పోజర్‌పై ఆధారపడి ఉంటుంది. PFAS కెమికల్స్ హార్మోన్లను ప్రభావితం చేసి పురుషులు, మహిళల్లో ఫెర్టిలిటీని తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. గర్భిణుల్లో కూడా జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గీతలు పడిన నాన్-స్టిక్ పాత్రలను వెంటనే మార్చాలి.మెటల్ స్పూన్లు కాకుండా చెక్క లేదా సిలికాన్ స్పూన్లు వాడాలి.ఖాళీ పాత్రను ఎక్కువ వేడి చేయకూడదు
260°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయకూడదు.పాత కోటింగ్ ఊడిపోతే వాడకూడదు. అయితే ఇవి పాడైపోతే వీటికి బదులుగా Stainless steel cookware, Cast iron cookware, సిరామిక్ కోటెడ్ పాత్రలు వాడుకోవాలి. సరైన విధంగా వాడితే నాన్-స్టిక్ పాత్రలు పూర్తిగా ప్రమాదకరం కావు. కానీ గీతలు పడినవి, పాతవి, అధిక వేడి చేసినవి మాత్రం ఆరోగ్యానికి హానికరమయ్యే అవకాశం ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version