
రిటైర్డ్ ఐఏఎస్ ఉదయలక్ష్మికి ఏపీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో ఓ పీఈటి అధ్యాపకుడి విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఆమె భేఖాతరు చేయడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. గతంలో రాజమండ్రికి చెందిన పీఈటి రత్నకుమార్ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. అతనికి న్యాయం చేయాలని అప్పుడు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఉదయాలక్ష్మికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఆమె అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కారణగా పరిగణించిన హైకోర్టు ఇవాళ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.