
ఈ సంవత్సరానికి వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి దక్కింది. వారిలో అమెరికాకు చెందిన జె హార్వే, చార్లెస్ ఎం రైజ్, బ్రిటీష్‌కు చెందిన హైకేల్ హోటాన్‌లు ఉన్నారు. హెపటైటిస్ సి వైరస్ కనిపెట్టినందుకు గాను వారికి ఈ బహుమతి దక్కినట్లు నోబెల్ కమిటీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. హెపటైటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న కాలేయ సమస్య. దీని ద్వారా కాలేయ క్యాన్సర్ వ్యాధి కూడా రావచ్చు. వీరు కనుగొన్న హెపటైటిస్ సి వైరస్ వల్ల మందుని కనుగొని ఎంతో మంది ప్రాణాలను కాపాడుకుంటున్నారు.