
ఎయిడెడ్ విద్యాసంస్థల్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు కొందరు యాజమాన్యాలు అంగీకరించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయా విద్యాసంస్థలకు బోధన, బోధనేతర సిబ్బంది సర్దుబాటు ప్రక్రియలో ఏ ఒక్క ఉపాధ్యాయుడు, విద్యార్థికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. స్కూళ్లను అప్పగించేందుకు సిద్ధమైన యాజమాన్యాల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని సురేష్ అధికారులను ఆదేశించారు.