
సామాజిక మాధ్యమా దుర్వినియోగాన్ని ఆపేందుకే కొత్త ఐటీ నిబంధనలను తీసుకువచ్చామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. వినియోగదారుల గోప్యత హక్కును ప్రభుత్వం గుర్తిస్తుందని మరోసారి ప్రకటించారు. కొత్త నిబంధనల అమలు విషయంలో కేంద్రం, వాట్సాప్ మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. ప్రజల గోప్యతకు ఏమాత్రం భంగం కలగకుండా ప్రభుత్వం దాన్ని గుర్తించి గౌరవిస్తుంది. వాట్సాప్ వినియోగదారులు కొత్త నిబంధనల గురించి భయపడాల్సిన పనిలేదు. తాము నిబంధనల్లో పేర్కొన్న నేరాలకు మూలాలను గుర్తించడమే ఇక్కడ ప్రధాన లక్ష్యమని తెలిపారు.