
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా కేసులు, చికిత్స, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితరాలపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరత, అధిక ధరలకు అమ్మకాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు. అని నిలదీసింది. బ్లాక్ మార్కెట్ ను అడ్డుకునేందుకు ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ధర్మాసనానికి వివరించింది. 1400 మంది బ్లాక్ ఫంగస్ రోగులు ఉండే 13 వేల ఇంజెక్షన్లే వచ్చాయని తెలిపింది.