
కులాలవారీగా జనగణనను చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ సోమవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. తమ అభ్యర్థనలను ప్రధాని విన్నారని ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడించారు. కులాలవారీగా జనగణపై మా డిమాండ్ ను ప్రధాని మోదీ విన్నారు. ఆయన దాన్ని తిరస్కరించలేదు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని మా బృందం కోరింది. మా విన్నపాన్ని పరిశీలిస్తామని మేం భావిస్తున్నాం అని నితీశ్ వెల్లడించారు. ఈ రోజు ప్రధానిని కలిసిన బృందంలో నితీశ్ కుమార్ తో సహా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.