
ఏపీలో 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. మే 1 నుంచి 18 నుంచి 45 వయసు వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని సీఎం చెప్పారు. ఏపీలో 18 నుంచి 45 మధ్య వయసు వారు 2,04,70,364 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు.