
పంజాబ్ లో కొత్త జిల్లా ఏర్పాటయ్యింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న మాలేర్ కోట్లను కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. మాలేర్ కోట్ల ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమకు ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు రంజాన్ కానుకగా వారి డిమాండ్ నెరవేరిందని సీఎం పేర్కొన్నారు. ఇప్పటివరకు మాలేరో కోట్లు సంగ్రూర్ జిల్లాలో భాగంగా ఉండేదని, ఈ క్షణం అది ప్రత్యేక జిల్లాగా అవతరించిందని అమరీందర్ సింగ్ చెప్పారు.