
కరోనా బారిన పడి కొన్ని దేశాలు గిలగిల్లాడుతున్నాయి. ప్రపంచంలో ఏదో ఓ మూల కరోనా వైరస్ కొత్త రూపంలో దర్శనమిస్తోంది. తాజాగా ఓ కొత్త కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ గ్రెగరీ గ్రే, అతడి శిష్యుడు లేషన్ క్ష్యూ ఈ కొత్త వైరస్ ను కనుగొన్నారు. ఈ వైరస్ కుక్కుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. గురువారం ప్రచురితమైన క్లినికల్ ఇన్ ఫెక్షన్ డిసీజెస్ జర్నల్ ఈ వివరాలను వెల్లడించారు. మలేషియాలోని సెరవాక్ ఆసుపత్రి రోగుల నుంచి 2017-18 సంవత్సరాలలో కొన్ని శాంపిళ్లను సేకరించారు. వీటిని పరీక్షించగా కొత్త కరోనా వైరస్ కంటపడింది.