
బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రభుత్వ జిల్లా దవాఖానల్లో ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించినట్లు కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. మంత్రులు, సీనియర్ అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం యడియూరప్ప ఈ నిర్ణయాలు ప్రకటించారు. నిపుణుల అభిప్రాయం తీసుకున్న మీదట కఠిన నియంత్రణలను జూన్ ఏడు వరకూ కొనసాగించాలని నిర్ణయించామని అన్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు.