
విద్యాశాఖపై అధికారులతో సమీక్షించిన సీఎ జగన్.. నూతన విద్యావిధానం అమలుపై సిద్ధం కావాలని ఆదేశించారు. స్కూళ్లకు సీబీఎస్సీ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. ఐసీఎస్ఈ అఫిలియేషన్ పై కూడా దృష్టి పెట్టాలన్నారు. వచ్చే ఏడాది స్కూలుకు వెళ్లేనాటికే విద్యాకానుక అందించాలని.. విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలన్నారు. అటు స్వేచ్చ కింద ఆడపిల్లలకు అక్టోబర్ లో శానిటరీ న్యాప్ కిన్స్ ఇవ్వాలన్నారు జగన్.