Nagarjuna Meets CM Chandrababu: సినీ నటుడు అక్కినేని నాగార్జున ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కొడుకు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. గతేడాది నవంబర్ లో అక్కినేని అఖిల్ కు జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరు జూన్ 6న పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే సింపుల్ గా జరగనున్నట్లు సమాచారం.